వీడియో లీక్‌…నెట్టింట వైరల్‌!

సోషల్ మీడియాలో ఏదైనా వీడియో ప్రత్యక్షమైతే, నెటిజన్లు ఏ మాత్రం ఆలోచించకుండా తెగ షేర్ చేస్తుంటారు. ఇలాగే, ఇప్పుడు ఓ భారీ సినిమాకు సంబంధించిన ఓ లీక్ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్‌ చేస్తున్న తాజా సినిమా ‘కూలీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ఓ సీన్‌కి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ‘కూలీ’ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నుంచి ఇలా వీడియోలు లీక్ కావడంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఎవరూ ఇలాంటి వీడియోలను రికార్డ్ చేయవద్దంటూ మేకర్స్ గట్టి ఆర్డర్‌ లను పాస్‌ చేశారు. అయితే, ఈ లీక్ వీడియోని చూసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని టాక్‌.

Related Posts

Comments

spot_img

Recent Stories