వాట్‌ ది ఫిష్‌ కోసం ఒకేసారి నలుగురు హీరోయిన్లు!

వాట్‌ ది ఫిష్‌ మేకర్స్‌ సినిమాలో నటీ నటులను గురించి ప్రకటించారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ కోసం యాక్టర్స్ అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్యలకు గ్రాండ్‌ గా స్వాగతం చెప్పారు.  ‘వాట్ ది ఫిష్’ ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ అని హైలేరియస్ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం చెబుతున్నారు. హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు ఉండటం సినిమాకు గ్రేట్ వాల్యుని యాడ్ చేస్తోందని చిత్ర బృందం తెలిపింది.

 ఇక ఈ మూవీ ట్యాగ్‌లైన్ – వెన్ ద క్రేజీ బికమ్స్ క్రేజియర్. వివిధ భాషల్లో షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories