తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘జైలర్’కు సీక్వెల్ చిత్రంగా ‘జైలర్-2’లో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడట నెల్సన్. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నాడని.. ఆయన ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో రజినీకాంత్‌తో కలిసి ‘వేట్టయన్’ మూవీలో నటించాడు ఫహాద్. ఇప్పుడు మరోసారి ‘జైలర్-2’లో వీరి కాంబో కలిసి నటిస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి.