మరోసారి మెగావారసురాలి జాతకాన్ని చెప్పిన వేణుస్వామి!

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. సినీ సెలబ్రిటీలకు , రాజకీయ నాయకుల జాతకాలు చెప్పి సోషల్‌ మీడియాలో పెద్ద సంచలనాలే క్రియేట్ చేసాడు. అక్కినేని వారసుడి పెళ్లి సమయంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని వేరు పడతారని ముందే చెప్పే అందర్ని షాక్‌ కి గురి చేశారు.

అయితే సామ్‌, చైతూ విడిపోవడంతో ఆయన జాతకాలు నిజమని అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఆ సంఘటన తరువాత ఆయన స్టార్‌ హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో వేణుస్వామి ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నాడు.
అయినప్పటికీ తగ్గేదెలా అన్నట్లు జాతకాలు చెప్తూ.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్లు ఇస్తున్నాడు. అయితే వేణు స్వామి గతంలో రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లిన్ కారా పుట్టినప్పుడు ఆమె భవిష్యత్తు గురించి చెప్పాడు. ఆమెది తిరుగులేని జాతకం అని అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని అన్నారు.

అలాగే ఉపాసనలకు ఇక పిల్లలు పుట్టరని చెప్పారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ అసలు పుట్టగానే అలా ఎలా జాతకం చెబుతారంటూ ఆయనను ట్రోల్స్ చేశారు.తాజాగా, ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామిని యాంకర్ ప్రశ్నించగా.. వేణు స్వామి స్పందిస్తూ.. ‘‘కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే వారికి ఉండే గండాల గురించి కూడా ముందుగానే చెప్పాలి. అందుకే చాలా మందికి జాతకాలు చెప్పరు.

అన్ని బాగున్న పిల్లలకు చెప్పవచ్చు. అందుకే తాను మెగా వారసురాలు క్లిన్ కారా జాతకం చెప్పాల్సి వచ్చింది.  కాబట్టి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. తానేదో తప్పు చేసినట్లు ట్రోల్స్ చేయకుండా ఉండటం మంచిది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories