విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో “‘సంక్రాంతికి వస్తున్నాం” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ వంటి ప్రదేశాల్లో శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
అయితే, ప్రస్తుత షెడ్యూల్ లో వెంకీ, మీనాక్షిలపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించగా.. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాట రొమాంటిక్ టోన్ లో సాగుతుందని తెలుస్తోంది.
కాగా ట్రైయాంగిల్ క్రైమ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.