మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న తాజా చిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన వివరాలు బయటకొస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నప్పటికీ, సినిమాలోని రెండవ భాగం మాత్రం ఊహించని మలుపులతో ఆసక్తిని పెంచనుందని టాక్.
ఇప్పటికే ఈ చిత్రం ఓ వినోదాత్మక చిత్రంగా ఉండబోతుందని చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సినిమాలో కామెడీతో పాటు ఓ సీరియస్ ట్రాక్ కూడా ఉండనుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చిరంజీవి పాత్రకి సంబంధించి ఓ ప్యాకింగ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను దర్శకుడు డిజైన్ చేశారట. ఇందులో మెగాస్టార్ మాఫియా నేపథ్యంతో కనిపించనున్నారని సమాచారం. ఆ ఎపిసోడ్‌లో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.
ఇక చిరంజీవి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా కథ తనకు ఎంతగా నచ్చిందో చెప్పారు. షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి చెప్పే సన్నివేశాలు వినగానే నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ చిరు చెప్పిన మాటలు ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయనలో ఉన్న ఎక్సయిట్‌మెంట్‌ను చూపిస్తున్నాయి. అభిమానులను తెగ హసివేయించేలా ఉండబోతున్న ఈ సినిమాని సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇన్ని క్రేజీ అప్‌డేట్స్ మధ్య ఈ సినిమా పై రోజురోజుకీ క్యూరియాసిటీ పెరుగుతుండడం విశేషం. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ మిక్స్ చేసిన వినోదాత్మక ప్యాకేజ్‌గా ఈ సినిమా రూపొందుతోందన్న హింట్ ఇప్పటికే బయటకొచ్చింది.