టాలీవుడ్ అందరి మోస్ట్ ఫేవరేట్ హీరో వెంకీ మామ హీరోగా తాజాగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం” . దర్శకుడు అనిల్ రావిపూడితో వరుస హిట్స్ తర్వాత చేస్తున్న మరో సినిమా ఇది కాగా దీనిపై కూడా మంచి బజ్ అయితే ఉంది. అయితే ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ కాగా నేడు వెంకీ మామ బర్త్ డే కానుకగా మేకర్స్ రెండో సాంగ్ ‘మీను’ ప్రోమో అలా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
మరి ఈ ప్రోమోలో ట్యూన్ అండ్ విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ పై కనిపిస్తున్న ఈ సాంగ్ లో వెంకీ మామ తన గతంలో తన ప్రేయసి కోసం వర్ణిస్తున్నాడు. అలాగే ఇందులో తన పోలీస్ గెటప్ కూడా అదిరిపోయింది. మరి ఈ సాంగ్ ని భీమ్స్ మంచి స్మూత్ మెలోడీగా కనిపిస్తుంది. ఇక ఈ ఫుల్ సాంగ్ ని అతి త్వరలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా సంక్రాంతి కానుకగా రానున్న జనవరి 14న సినిమా విడుదల కాబోతుంది.