వీరమల్లు మరో ప్రీ రీలిజ్‌ ఈవెంట్‌…ఎప్పుడో..ఎక్కడో తెలుసా!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ చారిత్రాత్మక డ్రామా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

సినిమా రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్, ప్రీ-రిలీజ్ కార్యక్రమాలు ఘనంగా జరిగిపోయాయి. వాటికి వచ్చిన రెస్పాన్స్‌తో టీమ్ మళ్లీ మరో ఈవెంట్ ప్లాన్ చేసింది. తాజా సమాచారం ప్రకారం, జూలై 23న సాయంత్రం నాలుగు గంటల నుంచి విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో మరో స్పెషల్ ఈవెంట్ నిర్వహించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

ఈ వేడుకకు అభిమానుల ఉత్సాహం తారాస్థాయిలో ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇందులో చేస్తున్న పవర్‌ఫుల్ రోల్‌పై ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ నటించగా, ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నాడు. మరోవైపు, సంగీతం మాత్రం కీరవాణి అందించడంతో పాటలు, నేపథ్య సంగీతంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

ఇలాంటి భారీ కాంబినేషన్‌తో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా మొదటి షో నుంచే బాక్సాఫీస్ వద్ద ఎలా దూసుకెళ్తుందా అనే ఆసక్తి సినీవర్గాల్లో తారాస్థాయిలో ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories