వీరమల్లు వచ్చేస్తున్నాడు..గెట్‌ రెడీ!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన కెరీర్‌ లో తొలిసారి హిస్టారికల్‌ ఎపిక్‌ వారియర్‌ మూవీ అయిన హరిహర వీరమల్లు లో ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను డైరెక్టర్‌ క్రిష్‌ పర్యవేక్షణలో పూర్తి చేయనున్నారు.

17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ టైమ్‌ లో  సినిమా యూనిట్ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి హరి హర వీర మల్లు పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌’ని విడుదల చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.

హరిహర వీరమల్లు టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ విజువల్ వండర్ ని వెండితెరపై చూస్తామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories