సాక్షికి చుక్కలు చూపించబోతున్న వాసిరెడ్డి పద్మ!

ఒక వ్యక్తి తెలిసో తెలియకో అసంబద్ధమైన మాటలు మాట్లాడుతాడు.. అనుచితమైన విషయాలను ప్రస్తావిస్తాడు.. అయితే వాటిని వార్తలుగా మలిచి ప్రచురించే ముందు- ఆ ప్రచురణ సంస్థకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. అతను మాట్లాడిన ప్రతి మాటను పొల్లుపోకుండా ప్రచురించేసి దానికి సంబంధించిన బాధ్యత మొత్తం అతనిదే.. మాకు నిమిత్తం లేదు అని ప్రచురణ సంస్థ తప్పించుకోవడానికి వీల్లేదు. దీనిని జర్నలిస్టిక్ ఎథిక్స్ అంటారు. అందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు కూడా ఉంటాయి. కొన్ని విషయాలను ప్రచురించకూడదు అనే నిబంధనలు, విలువలు కూడా జర్నలిస్టుల పాటించాలి.

కానీ విలువలతో సంబంధం లేని జర్నలిజం చేయడమే తమ ఆశయం అన్నట్టుగా వ్యవహరించే సాక్షి మీడియాపై- నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అమ్మాయిల భద్రతకు ముప్పు వాటినేలాగా వారి ఆత్మ గౌరవం కించపరిచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరిస్తే.. ఆయన మాటలను యధాతధంగా ప్రసారం చేయడం ద్వారా సాక్షి మీడియా మరింత తప్పు చేసిందని వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘‘ఆ వూళ్లో  ఫలానా అమ్మాయి. ఈ ఊర్లో ఫలానా అమ్మాయి’’ అంటూ అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను చదివి వినిపించారు. అత్యాచారానికి గురైన అమ్మాయిలు పేర్లను బయటపెట్టడమే నేరం. పోలీసులు కూడా బహిరంగంగా చెప్పరు.  అయితే ఆ విలేకరుల సమావేశం వీడియోలను సాక్షి మీడియా యధాతధంగా ప్రసారం చేసింది. పది రోజులు గడుస్తున్నా వీడియోలను బాధ్యతారహితంగా యూట్యూబ్ లోనే ఉంచేసారంటూ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ మీట్లో పేర్లు చదివిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, సాక్షి యాజమా,న్యం సిబ్బంది మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాధవ్ సమాజం పట్ల బాధ్యతగానీ,  బాధితులైన అమ్మాయిల పట్ల కనీసం జాలి గానీ లేకుండా మాట్లాడారని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడినట్లుగా ఉండదని ఆమె ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సాక్షి యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియోను తక్షణం తొలగించాలని కూడా ఆమె సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయడం గమనార్హం.

అత్యాచారం జరిగితే ఆడవాళ్ళ పేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో చూపించకూడదు అనేది జర్నలిజం నైతిక విలువలలో ముఖ్యమైనది. బాధితులు లేదా నేరస్తులు మైనర్లు కూడా అయినప్పుడు అసలు ఏ వివరాలనూ వెల్లడించకూడదు అని కూడా జర్నలిజం విలువలు చెబుతాయి. కానీ ఈ విలువలతో తమకు పని లేదన్నట్లుగా- అత్యాచారానికి గురైన అమ్మాయిలలో మైనర్లు ఉన్నప్పటికీ కూడా వారి పేర్లు, ఊర్లు వివరాలన్నింటిని సాక్షి మీడియా, గోరంట్ల మాధవ్ కలిసి బయట పెట్టడం దుర్మార్గం అని అందరూ ఆగ్రహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories