No menu items!
No menu items!

సామ్‌ పై వరుణ్‌ కీలక కామెంట్లు!

ప్రస్తుతం ఓటీటీలో విడుదలకి సిద్ధంగా ఉన్న అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది స్టార్ హీరోయిన్ సమంత అలాగే బాలీవుడ్ స్టార్‌ నటుడు వరుణ్ ధావన్ కాంబో లో యంగ్ దర్శకులు రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ వెబ్ సిరీస్ “సిటాడెల్ హనీ బన్నీ” మరికొన్ని రోజుల్లో అలరించబోతుంది.

అయితే ఈ సిరీస్ కి ముందు టీం అంతా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా  ఉన్నారు. ఇక ఈ బిజీగా ఉన్న సమయంలో వరుణ్ ధావన్ పెట్టిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తమ వెబ్ సిరీస్ నుంచి ఓ స్టిల్ ని షేర్ చేసి దానికి సమంత, నేచురల్ స్టార్ నాని నటించిన “ఈగ” సినిమాలో నేనే నానీనే సాంగ్ తెలుగు వెర్షన్ ని పెట్టి అరె అరె అరే అంటూ పోస్ట్ చేసాడు.

మరి ఈ స్టిల్ లో అయితే ఇద్దరు నడుమ కూడా మంచి కెమిస్ట్రీ కనపడుతుంది. దీంతో వరుణ్ ధావన్ చేసిన ఈ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు ఫుల్‌ వైరల్ గా మారింది. ఇక వీరి కలయికలో వస్తున్న సిరీస్ ఈ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories