మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్‌ను వర్కింగ్ టైటిల్ VT15తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదొక పూర్తిస్థాయి హారర్ డ్రామాగా రూపొందుతోంది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేయనటువంటి పాత్రను ఇందులో చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ వర్క్ వేగంగా సాగుతోందని అప్‌డేట్ వచ్చింది. సంగీత దర్శకుడు థమన్‌తో కలిసి హీరో వరుణ్ తేజ్ స్టూడియోలో పలు సెషన్లలో పాల్గొంటున్న ఫోటోను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. థమన్ ఈ సినిమాకోసం యూనిక్ ఆల్బమ్ రూపొందిస్తున్నాడని, పాటలు విడుదలైతే అందర్నీ మెప్పిస్తాయని భావిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తోంది. ఇక కమెడియన్ సత్య ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. షూటింగ్ పనులు కొనసాగుతుండగా, వచ్చే నెలల్లో ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశముంది.