వరుణ్‌ తేజ్ తరువాత సినిమా ఆ డైరెక్టర్‌ తోనా!

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ హారర్-కామెడీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, తన నెక్స్ట్ మూవీని లైన్‌లో పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ కోసం కథలు వింటున్నాడట. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ వరుణ్ తేజ్‌కు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రాన్ని తెరకెక్కించి భారీ డిజాస్టర్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. అయితే, ఆ తర్వాత గోపీచంద్‌తో ఓ సినిమా చేయాలని చూసినా, అది వర్కవుట్ కాలేదు.

ఇక ఇప్పుడు వరుణ్ తేజ్‌తో తన నెక్స్ట్ మూవీని తీయాలని ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. మరి వరుణ్ తేజ్ ఈ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories