బర్త్ డే పాప సినిమా కి వెరైటీ టైటిల్!

మాలీవుడ్‌ ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌ గురించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమే అక్కర్లేదు. అలా మొదలైంది అంటూ తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఇష్క్‌ , గుండె జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకుని కూర్చుంది… ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది.

కొంత కాలం క్రితం ‘భీమ్లానాయక్‌’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌ ఎక్కేసింది. సోమవారం నిత్యామీనన్ బర్త్‌ డే. ఈ సంద‌ర్భంగా నిత్యాకు సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే నిత్యా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తాను న‌టిస్తున్న కొత్త ప్రాజెక్ట్ నుంచి మేక‌ర్స్ అప్‌డేట్ ఇచ్చారు. నిత్యామీనన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం డియర్ఎక్స్ . ఈ సినిమాకి  కోలీవుడ్ ద‌ర్శ‌కురాలు కామిని ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాని బాస్క్‌ టైమ్‌ థియేటర్స్‌ పోస్టర్‌ మీడియా నెట్‌వర్క్‌ బ్యానర్‌ లతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తుంది.

ఈ సినిమా నుంచి నిత్యా మీనన్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్టర్ లో  పెళ్లి కూతురు గెట‌ప్‌లో నిత్యా ఓ చేతిలో  డ్రింక్.. మ‌రోవైపు ఫోన్ ప‌ట్టుకుని కనిపిస్తుంది. దీనిని కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తీర్చిదిద్దనట్లు పోస్టర్‌ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో  విన‌య్ రాయ్, న‌వ‌దీప్, ప్ర‌తీక్ బబ్బ‌ర్, దీప‌క్ ప‌రంబోల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories