సివంగిగా రాబోతున్న వరలక్ష్మి , ఆనందిలు!

తమిళ అమ్మాయి అయినా తెలుగులో తన నటన, అందం, డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అమ్మాయి..వరలక్ష్మి శరత్‌ కుమార్‌. తెలుగు అమ్మాయి అయినా తమిళంలో తన నటనతో అందర్ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ఆనంది. తాజాగా వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సివంగి అనే పేరును ఖరారు చేశారు.

ఈ సినిమాకి 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనిం చిత్ర బృందం తెలిపింది.

ఓ మహిళ తన జీవితంలో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అనే కథాంశం అని డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి వివరించారు. ఇక ఈ చిత్రానికి AH.కాసిఫ్ – ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వంలో పాటు డీవోపీగా పని చేస్తున్నారు భరణి కె ధరన్. సంజిత్ Mhd ఈ సినిమాకి ఎడిటర్. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేస్తారు.

Related Posts

Comments

spot_img

Recent Stories