రెండు సినిమాలతో వంశీకృష్ణ!

ప్రస్తుత పరిస్థితుల్లో ఓ దర్శకుడు 5-6 సంవత్సరాలకు ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఓ యంగ్ డైరెక్టర్ ఏకంగా రెండు సినిమాలతో ఈ వేసవిలో టాలీవుడ్‌ను టచ్ చేయబోతున్నాడు. అతను మరెవరో కాదు.. వంశీ కృష్ణ మళ్ళ. లెజెండరీ స్టార్ యాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో త్వరలో రాబోతున్న “దక్ష” ఓ వైపు.. హర్ష, ఇనయ సుల్తానా కాంబినేషన్లో తెరకెక్కిన “మదం” సినిమా మరోవైపు.. ఇలా రెండు సినిమాల డైరెక్షన్ బాధ్యతలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని, రెండు సినిమాలను ఈ వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమయ్యారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ.. “నాకు దక్ష వంటి మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించిన మోహన్ బాబు గారికి, మంచు లక్ష్మి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సెన్సార్ బోర్డు మదం సినిమా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉందనిపించి రివిజన్ కమిటీకి సిఫార్సు చేసారు. రివిజన్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వగానే ఈ వేసవికి థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం. ఆ రెండు సినిమాలు సక్సెస్ బాటలో పయనించి డైరెక్టర్ గా మంచి పేరు తెస్తాయని ఆశిస్తున్నాను..’ అని అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories