‘అర్జెంటుగా సర్దేయాలి’ వైసిపి నేతల తొందర!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సగం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలిలో దీపం పెట్టాం దేవుడా నీదే భారం అన్న సామెత మాదిరిగా ఆందోళన చెందుతున్నారు. కాగా మరో సగం మంది అదే పార్టీకి చెందిన నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతకు అనుగుణంగా రెచ్చిపోతున్నారు. అవును ఇలాంటి విచిత్రమైన వాతావరణం ఆ పార్టీలో నెలకొని ఉంది.

జగన్మోహన్ రెడ్డి ఈసారి తమ పార్టీ ఎన్నికలలో 151 మించి స్థానాలు సాధిస్తుందని ఐప్యాక్ వారి సమావేంలో డంకా బజాయించి చెప్పారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు అనుగుణంగా కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 30 స్థానాలు దక్కితే చాలా గొప్ప విజయం దక్కినట్లే భావించాలని ప్రజలు అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో భారీగా డబ్బు కుమ్మరించారు. కొన్ని నియోజకవర్గాలలో వంద నుంచి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల ఖర్చు అంటే అనూహ్యమైన, నమ్మశక్యం కాని సంగతి. అంతంత డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత విజయం దక్కుతుందో లేదో అనే అనుమానం వారిలో మొదలవుతోంది. పోటీ చేసిన వారంతా భయం లో బతుకుతున్నారు.

పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థుల్లో ఇలా ఓడుతామేమో అనే భయం ఒకవైపు, గెలిచే నమ్మకం ఉన్న వారికి కూడా పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అనే భయం మరోవైపు వెన్నాడుతున్నాయి. వీరి కత ఇలా ఉంటే.. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరూ… అర్జంటుగా వీలైనంత సంపాదించేయాలి అని ఆరాటపడుతున్నారు. జగన్ చేపట్టిన నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఆలయ ట్రస్టుబోర్డుల చైర్మన్లు, ఇంకా కార్పొరేషన్ పదవుల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఈసారి  పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడంతో.. ఇప్నుడే వీలైనంత సంపాదించుకోవాలని చూస్తున్నారు. కొత్తగా కాంట్రాక్టులు ఇచ్చేయాలని అనుకుంటున్నారు. మొత్తానికి కొత్త సర్కారు వస్తే.. తమ నామినేటెడ్ పదవులు గల్లంతు అవుతాయనే భయం వారిని వెన్నాడుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories