తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఉప్పెన. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. డైరెక్టర్ కి ఏకంగా జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాను బాలీవుడ్ కి తీసుకుని వెళ్తున్నారనే వార్త చాలా కాలం వినిపిస్తున్న టాక్.
తాజాగా ఈ సినిమా రీమేక్ గురించి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్వయంగా తెలిపారు. రెండు రోజుల క్రితం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చి బాబు సాన కాంబోలో వస్తున్న ఆర్సీ 16 సినిమా పూజా కార్యక్రమానికి జాన్వీ తో పాటు బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా చూశాను. చాలా నచ్చింది.
దీన్ని హిందీలో రీమెక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నా చిన్న కూతురు ఖుషీ కపూర్ ను కూడా ఉప్పెన చూడమని చెప్పాను. ఖుషీకి ఈ చిత్రం నచ్చి ఓకే అంటే త్వరలోనే ఈ చిత్రం రీమేక్ ఖాయంగా అనిపిస్తోంది. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారు అనేదాని మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ఉప్పెన తెలుగులో సూపర్ హిట్ సాధించడంతో హిందీలో కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది చూడాలి.