మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రం ‘విశ్వంభర’ను విడుదలకు సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే , చిరు తన తరువాత ప్రాజెక్టులను ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమాను ప్రకటించాడు చిరు.
అయితే, మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా మెగాస్టార్ సినిమా ఉండబోతుందని సమాచారం ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఓ ఆసక్తికర సమాచారాన్ని అందించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత చిరంజీవితో కలిసి ఆయనకు ఎలాంటి కథ కావాలనే విషయాన్ని మాట్లాడి, దానికి తగ్గట్టుగా కథను రెడీ చేసే పనిలో ఉంటామని అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అంతేగాక, ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా తెరకెక్కించాలని అనిల్ రావిపూడి ప్లాన్ భావిస్తున్నట్లు సమాచారం.