ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం కూడా ఒకటి. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా అనౌన్స్ అయ్యిన ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటుల్లో కన్నడ సీనియర్ నటులు శివ రాజ్ కుమార్ కూడా ఒకరు.
అయితే శివ రాజ్ కుమార్ రీసెంట్ గానే కాన్సర్ చికిత్స నుంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఇందులో తనపై ఒక స్టన్నింగ్ లుక్ ని ప్రిపేర్ చేసి ఈ లుక్ టెస్ట్ తో ఫైనల్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక దీనితో పాటుగా శివన్న అతి త్వరలోనే సెట్స్ లో కూడా అడుగు పెడతారని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.