టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రంగా వస్తుండటంతో ప్రస్తుతం ఈ మూవీకి NKR21 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తయ్యింది. అయినా కూడా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేయలేదు.
దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారట. ఈ సినిమా కథ ఎవరి ఊహకు అందని విధంగా ఉండబోతుందని.. ఇందులోని కథనం.. సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఊహకందని విధంగా ఉండబోతున్నాయని.. థ్రిల్లింగ్ అంశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే పూర్తి వైవిధ్యమైన చిత్రంగా ఉండబోతుందని వారు ధీమాగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఆమెను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.