ఈ వారం థియేటర్లలోకి వచ్చిన రెండు కొత్త తెలుగు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా, ఆమె స్వయంగా ఓ చిన్న పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే విధంగా, యంగ్ హీరో శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా కలిసి నటించిన సింగిల్ సినిమాకూడా ప్రేక్షకుల అభిమానం అందుకుంది.
ఇవెరటికీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే, విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం. ప్రీమియర్ షోలు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలిచాయి. కంటెంట్ పరంగా ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలో కూడా ఈ సినిమాలు మంచి ఆరంభాన్ని నమోదు చేశాయి. శుభం సినిమా యూఎస్ మార్కెట్ లో 75 వేల డాలర్లకు పైగా గ్రాస్ సాధించగా, సింగిల్ సినిమా అయితే లక్షా 50 వేల డాలర్లకు మించి కలెక్షన్స్ తో దూసుకెళ్లింది.
ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం రెండు సినిమాలకూ బాగా ఉపయోగపడింది. వీకెండ్ పూర్తయ్యే సరికి వసూళ్లు ఇంకా ఎంతవరకు పెరుగుతాయో చూడాలి. మొత్తం మీద ఈ రెండు సినిమాలూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించడంలో విజయవంతమయ్యాయని చెప్పొచ్చు.