తారక్‌- నీల్‌ నుంచి రెండు బ్లాస్టింగ్ ప్రకటనలు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తో చేస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమా చేస్తున్న ఈ సినిమాపై గట్టి హైప్ అయితే ఏర్పడింది. ఇక ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటికపుడు తాజా సమాచారం అందిస్తూనే ఉన్నారు.

మరి ఇలా తాజాగా మరో ట్రీట్ ని తీసుకుని రాబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే అనూహ్యంగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటన  చేయడమే కాకుండా ఈ సినిమా తాలూకా గ్లింప్స్ పై కూడా క్రేజీ అప్డేట్ ని వారు అందించారు. ఇక ఈ మే 20న తారక్ బర్త్ డే కానుకగా అవైటెడ్ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లుగా తేల్చి చెప్పారు.

ఇక దీంతో పాటుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ నుంచి వచ్చే ఏడాది జూన్ 25న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లుగా అధికారులు  ప్రకటించారు. ఇలా రెండు బ్లాస్టింగ్ అప్డేట్స్ తారక్ ఫ్యాన్స్ కి వచ్చేసాయి అని తెలుస్తుంది.. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories