ఒక్కపాట కోసం రెండు పెద్ద సినిమాలు..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాల్లో  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ని క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటెసీ సినిమాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు.

గాస్టార్ చిరంజీవి చికెన్‌గున్యాతో బాధపడుతుండటంతో ఈ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్‌ను సెప్టెంబర్ నెలాఖరుకు చిత్రీకరించాలని సినిమా బృందం భావిస్తుంది. చిరంజీవి కోలుకుని సెట్స్‌కి రాగానే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుపుతారని టాక్ నడుస్తుంది.

అటు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘పుష్ప-2’ కూడా ఇప్పటికే షూటింగ్  చివరిదశ  కు వచ్చింది. ఈ సినిమాలోనూ ఓ ఐటెం సాంగే షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి శ్రీలీల, త్రిప్తి డిమ్రిల పేర్లను మూవీ మేకర్స్‌ పరిశీలిస్తున్నారట. ఈ పాట షూట్‌ను అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒక్క ఐటెం సాంగ్ కోసం ఈ రెండు పెద్ద చిత్రాలు కూడా పెండింగ్‌లో పడటంతో ప్రస్తుతం అభిమానుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Related Posts

Comments

spot_img

Recent Stories