విశాఖలో కొలువుల సునామీ.. మరో 50వేలకు చాన్స్!

ఈ అయిదేళ్ల చంద్రబాబునాయుడు 4.0 ప్రభుత్వ కాలంలో.. రాష్ట్రవ్యాప్తంగా యువతరానికి 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యం దిశగా.. ఎన్డీయే కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు కల్పించే టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలు విశాఖకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సుమారు యాభై వేల ఉద్యోగావకాశాలు కల్పించే మరో నాలుగు కంపెనీల ఏర్పాటుకు  రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ నాలుగు కంపెనీలు కలిపి 20 వేల రూపాయల పెట్టుబడులతో విశాఖకు రానున్నాయి. రాష్ట్రానికి కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వం దూకుడు పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో 16.5 వేల కోట్ల రూపాయలతో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్టణం మొదటిదశలో ఆ సంస్థ రూ.1466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి దొరుకుతుందని, రెండో దశలో 15వేల కోట్ల పెట్టుబడులతో మరో 400 మందికి ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. అలాగే విశాఖ మధురవాడలోని సాత్వా డెవలపర్స్ 1500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 25వేల మందికి ఉద్యోగావకాశాలు అందిరానున్నాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ పేరిట ఎండాడలో 1250 కోట్ల పెట్టు బడులు పెట్టనున్నారు. ఈ సంస్థ ద్వారా కూడా మరో 15వేల ఉద్యోగాలు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ మధురవాడలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోందని, తద్వారా పదివేల ఉద్యోగావకాశాలు రానున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గానీ.. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు తీసుకురావడం గురించి ముమ్మరంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. పెట్టుబడిదారుల్ని కలుస్తూ, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా వచ్చేలా నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా తీసుకువచ్చారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే నాలుగేళ్లలో యువతరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకుని అడుగులు వేస్తున్నారు.

కొత్తగా నాలుగు కంపెనీల ఏర్పాటుకు ఎస్ఐపీబీ భేటీలో ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంలో సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్టుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిష్ఠాత్మక సంస్థల రాకతో విశాఖ ఇమేజి కూడా పెరుగుతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories