ఈ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం లాంగ్ వీకెండ్ కానుకగా టాలీవుడ్ నుంచి విడుదల కి వస్తున్న తాజా చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సినిమా “మిస్టర్ బచ్చన్” కూడా ఒకటి. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫ్యాన్స్ లో జనరల్ ఆడియెన్స్ లో కూడా డీసెంట్ బజ్ ని సొంతం చేసుకుంది.
అయితే లేటెస్ట్ గా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. మిస్టర్ బచ్చన్ తో థియేటర్స్ లో రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా మాస్ యంగ్ రెబల్ స్టార్ అభిమానులకి కూడా క్రేజీ ట్రీట్ ఉంది అంటున్నారు. ఇదేలా అంటే మిస్టర్ బచ్చన్ విడుదల అవుతున్న ప్రతి స్క్రీన్ లో బచ్చన్ ప్రింట్ తో పాటుగా ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ది రాజా సాబ్” తాలూకా గ్లింప్స్ ని కూడా అటాచ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఓ క్లారిటీ ఇచ్చారు. దీనితో మాస్ ఫ్యాన్స్ తో పాటుగా రెబల్ ఫ్యాన్స్ కి కూడా మంచి ట్రీట్ అది కూడా బిగ్ స్క్రీన్స్ పై అందబోతుందని చెప్పాలి.