‘సోషల్ మీడియా కార్యకర్తలు’ అనే ముసుగులో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న వారికి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు తోచినట్టుగా తప్పుడు పోస్టుటు పెట్టడం, బురద చల్లడం, అసభ్యకరకమైన డిజైన్లు తయారుచేసి సోషల్ మీడియాలో విషం కక్కడం అనేవి వాళ్లు అయిదేళ్లుగా అలవాటుగా మార్చుకున్నారు. కానీ.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కత్తి దూస్తున్నదని భయపడుతున్నారు. అర్థం పర్థంలేని, అసభ్యమైన, తప్పుడు వివరాలతో కూడిన నీచమైన ప్రచారానికి సోషల్ మీడియా ద్వారా పాల్పడితే.. ప్రభుత్వం తమ తాట తీస్తుందనే భయం వారిలో మొదలవుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత అయిదేళ్లు జగన్ రాజ్యంలో రకరకాలుగా చెలరేగిపోయారు. పోలీసుల్ని కూడా వివిధ మార్గాల్లో లోబరచుకుని పెట్టుకున్నారు. అవినీతి అరాచకాల సొమ్ముల్లో తమకు కూడా కొంత వాటా తప్పకుండా ఉంటుంది గనుక.. పోలీసులుకూడా వారి మోచేతి నీళ్లు తాగుతూ, వారికి కొమ్ముకాస్తూ వచ్చారు. పోలీసులు – వైసీపీ నాయకులు ఒకరికొకరు అండగా ఉంటూ చెలరేగిపోతూ వచ్చారు. ఆ కారణం చేత.. ప్రభుత్వం మారినా సరే.. వైసీపీ నేతలు ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిపోస్టులతో చెలరేగిపోతూ వచ్చారు. పులివెందులకు చెందిన నర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు పట్టుకున్నట్టే పట్టుకుని, చివరికి 41ఏ నోటీసలు ఇచ్చి వదిలేయడం కూడా ఇలాంటిదే. పోలీసులతో ఆల్రెడీఉన్న లాలూచీ ఫలితమే. ఎస్పీతో సహా అందుకే బదిలీ అయ్యారు.
కానీ పరిస్థితులు అలాగే కొనసాగబోవడం లేదు ఇక్కడ సస్పెన్షన్లు జరినగినట్టే రాష్ట్రమంతా కత్తి దూయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. తప్పుడు పోస్టులు పెడుతూ విషప్రచారాలు సాగించేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఇలాంటి సోషల్ మీడియా బురద పనులు చేసినందుకు గుంటూరు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డికి కోర్టు 14రోజుల రిమాండు విధించింది. ఆయన శిక్ష తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.
ఒకవైపు సోషల్ మీడియాలో చెలరేగే ధూర్తులను మరింతగా రెచ్చగొట్టడానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటివారు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మీరేం భయపడొద్దు.. పార్టీ సెంట్రల్ ఆఫీసులో లీగల్ సెల్ ఏర్పాటుచేస్తున్నాం.. వారు మీ అరెస్టులపై లీగల్ పోరాటం చేస్తారు అంటున్నారు. సజ్జల మాటలు వెంటే వైసీపీ సోషల్ మీడియా దళాలు వణికిపోతున్నాయి. అరెస్టు అయితే పోరాడుతాం అంటారే తప్ప.. అరెస్టు కాకుండా దారిచూపే దిక్కులేదని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దళాల్లో ఇప్పటికే భయం మొదలైనట్టుగా తెలుస్తోంది.