నేచురల్ స్టార్ నాని హోం బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్న లేటెస్ట్ కోర్టు రూం డ్రామా మూవీ ‘కోర్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు మేకర్స్.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు ఇప్పుడు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే అంందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చి 7న ‘కోర్ట్’ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ఇంటెన్సిటీతో రానుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఈ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను కూడా ఓ వీడియో రూపంలో చేయగా, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.