బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ మలైకా అరోరా గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ “గబ్బర్ సింగ్” సినిమాలో కెవ్వు కేక సాంగ్ తో తాను టాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మలైకా అరోరా కుటుంబంలో ఓ ఊహించని విషాద సంఘటన జరిగింది.
ఆమె తండ్రి అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకున్న వార్తలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ముంబై, బాంద్రాలోని తమ ఇంటి బిల్డింగ్ ఆరవ ఫ్లోర్ నుంచి అనీల్ అరోరా దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ అనీల్ అరోరా ఆత్మ హత్య వాంగ్మూలం లాంటిది ఏదీ వారు కనుక్కోలేదు.
దీంతో వారి మరణానికి కారణం ఏంటి అనేది గోప్యం గానే ఉండిపోయింది. ప్రస్తుతం మలైకా తో పాటు అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్ కుటుంబీకులు అంతా ముంబై చేరుకున్నట్టుగా తెలుస్తుంది.