యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన మణిరత్నం, తాజాగా ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించాలని మణిరత్నం ఆలోచిస్తున్నారట. ఇందులో హీరోగా నవీన్ పోలిశెట్టిని తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్.
ఈ హీరో పాత్రకు నవీన్ సెట్ అవుతాడని భావించి, ఆయనతో చర్చలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. నవీన్ ఇటీవలి కాలంలో తనకు బాగా సూటయ్యే కథలతోనే ముందుకు సాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. విభిన్నమైన స్క్రిప్ట్స్ ఎంపిక చేస్తూ, ప్రేక్షకుల్లో విశ్వాసం పెంచుకున్నాడు.
ఇక మణిరత్నం విషయానికి వస్తే, అతనికి దర్శకుడిగా విపరీతమైన గుర్తింపు ఉన్నా, కొంత కాలంగా మాత్రం హిట్ చిత్రాల పరంగా వెనుకబడిపోయాడు. గతంలో ఆయన తీసిన సినిమాలకు కథలో గొప్ప బలం ఉండేది. కానీ ఇటీవల మాత్రం ఆయన చిత్రాలకు ఆ మేజిక్ కనిపించడం లేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నవీన్, మణిరత్నం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనే సందేహం కొనసాగుతోంది.
ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్‌తో కలిసి ‘థగ్ లైఫ్’ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఇందులో శింబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలోనే మణిరత్నం నవీన్ పోలిశెట్టితో మరో సినిమాను ప్లాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.