క్లీన్‌ అండ్ గ్రీన్‌ బాట పట్టిన టాలీవుడ్‌ బుట్టబొమ్మ!

గత కొంత కాలంగా టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే పెద్దగా సినిమా ఆఫర్లను అందుకోవడం లేదు.  ఒకప్పుడు పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్‌ హీరోల సరసన నటించేందుకు వరుస పెట్టి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. ఒక్కప్పుడు వచ్చిన ఆఫర్స్ ఇప్పుడు మాత్రం ఆఫర్లు రావడం లేదు. సినిమా పరిస్థితి ఎలా ఉన్న కూడా వార్తల్లో మాత్రం ఆమె నిత్యం ఏదో విషయంలో ఉంటుంది.

ఇక తాజాగా పూజా ‘గ్రీన్ అప్‌ కార్యక్రమం’ లో పాల్గొన్న పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చెత్తను ఊడ్చడంతో పాటు పచ్చదనం పరిశుభ్రత అంటూ అందాల పూజా హెగ్డే చెట్లను నాటి అందరి దృష్టిని తను వైపునకు తిప్పుకుంది. ఈ సమయంలో తీసిన ఫోటోలలో అందాల బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఎంతో అందంగా కనిపించడంతో మరింత వైరల్ గా మారాయి.

వావ్ అనిపించేంత హాట్ గా పూజ హెగ్డే కనిపిస్తుండడంతో అభిమానులు ఈ ఫోటోలను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంత అందమైన అందానికి సినిమా ఇండస్ట్రీలో సినీ అవకాశాలు తక్కువగా రావడంతో చాలామంది విచారణ వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే మరోమారు పూజా  కచ్చితంగా బిజీ అవుతుందని  కామెంట్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories