టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యువ నటీనటుల్లో తన టాలెంట్ తో అమితంగా మెప్పించిన నటుడు సుహాస్ కూడా ఒకడు. పలు సినిమాల్లో కీలక పాత్రలతో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న సుహాస్ ఇపుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుండగా వీటితో పాటుగా తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి నటిస్తున్న తాజా చిత్రం “మందాడి”లో తాను నటించనున్నాడు.
దీనితో తన కోలీవుడ్ డెబ్యూ పై మంచి ఆసక్తి ఇపుడు నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని మథిమారన్ పుగళేంది డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుహాస్ తో పాటుగా కట్టప్ప సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ లాంటి నటులు కూడా నటిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలో సుహాస్ కి ఎలాంటి రోల్ ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.