టాలీవుడ్లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు. ఇక శ్రీవిష్ణు ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఫిబ్రవరి 28న శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘మృత్యుంజయ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాను హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. పూర్తి యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ‘జై’ అనే పాత్రలో శ్రీవిష్ణు సరికొత్త వేరియేషన్స్‌తో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అందాల భామ రెబా జాన్ పోలీస్ పాత్రలో నటిస్తోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.