బాలీవుడ్ లో ప్రస్తుతం భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ “రామాయణ” పై అందరి దృష్టి వెళ్లింది. ఇదివరకే రామాయణ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం కథానాయకుడు రణబీర్ కపూర్, కథానాయికగా సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ సినిమా మీద ప్రత్యేకంగా ఆసక్తి పెరిగింది. దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటం మరో విశేషం.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మొదటి లుక్ మరియు చిన్న గ్లింప్స్ July 3న రిలీజ్ కానున్నాయి. ఉదయం 11:30కి ప్రత్యేక ఈవెంట్ ద్వారా ఈ అప్డేట్ ఇవ్వనున్నారు. దీనితో సినిమాపై నెలకొన్న హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ చిత్రంలో ఒక వైపు రణబీర్ లార్డ్ రాముడి పాత్రలో కనిపించనుండగా, మరోవైపు కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. అదే సమయంలో యష్ ఈ సినిమాకి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. అలాగే నమిత్ మల్హోత్రా కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
ఇంతటి భారీ కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఫస్ట్ గ్లింప్స్ లో కథలోని గ్రాండ్ నెస్, విజువల్స్ ఎలా ఉంటాయో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు కథ, తారాగణంపై మరిన్ని క్లారిటీలు వచ్చే అవకాశం కూడా ఉంది.