కొవిడ్ తరువాత ఓటీటీల ప్రాబల్యం భారీగా పెరిగింది. ప్రపంచంలోని అన్ని భాషల సినిమాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి పల్లెకు చేరుతున్నాయి. కేవలం ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా వారి భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ మనలాగా వినలేని, మాట్లాడలేని (బధిరుల) పరిస్థితి ఏంటనే విషయం చాలామందికి డౌట్ వస్తుంది.
గతంలో దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం వచ్చే బధిరుల వార్తల గురించి తెలిసిందే. ఈ సైన్ లాగ్వేజ్ బయటి దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ మనదేశంలో ఇప్పుడిప్పుడే ఈ భాషపై అవగాహన వస్తోంది.అయితే రవితేజ కథానాయకుడిగా గత దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. చెవిటి , మూగ వారి కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు.
ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు రికార్డులు సృష్టించనుంది. వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనతో ఈ సినిమా బావుందనే పేరు తెచ్చుకున్నప్పటికీ లాభాలు మాత్రం తీసుకురాలేక పోయింది .ఇదిలా ఉండగా గతంలో రణవీర్ సింగ్ నటించిన 83 చిత్రాన్ని కూడా ఈ సైన్ లాంగ్వేజ్‌లో తీసుకు వచ్చినా ఫస్ట్ టైం టైగర్ నాగేశ్వర రావు చిత్రం మాత్రమే మన భారతీయ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలో విడుదల అవుతున్న చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమేరకు ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.