థగ్‌ ఆఫ్‌ లైఫ్‌ షూటింగ్‌ అప్టేట్!

లోక నాయకుడు కమల్‌ నటించిన తాజా చిత్రం ఇండియన్‌ 2 కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా గతంలో సూపర్‌ హిట్ అయిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఇండియన్ 2 సినిమాను మేకర్స్ జులై 12 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 సినిమాను రిలీజ్ చేయాలని విడుదల చేసేందుకు చిత్ర బృందం రంగం సిద్దం చేస్తుంది.

ఇదిలా ఉంటే కమల్ నటిస్తున్న   తాజా చిత్రం “థగ్ లైఫ్ “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. కమల్,మణిరత్నం కాంబినేషన్ లో 37 ఏళ్ళ తరువాత  వస్తున్న సినిమానే “థగ్ లైఫ్ “. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను కమల్ హాసన్ ,ఆర్ మహేంద్రన్ ,మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. థగ్ లైఫ్ షూటింగ్ 60 % షూటింగ్ పూర్తయినట్లు ఇప్పటికే సమాచారం. మరో 40 రోజుల్లో మిగిలిన షూటింగ్  పూర్తి చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories