మెగా అభిమానులను టెన్షన్‌ పెడుతున్న థగ్‌ లైఫ్‌!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా  ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నా, మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. థగ్ లైఫ్ కోసం ఆయన అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోవడమే కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఇంప్రెష్ చేయలేకపోయింది. దీనివల్లే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న పెద్ది సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న పెద్ది ఓ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ సినిమా సంగీతం కూడా గత సినిమా తరహాలో ఉంటే మాత్రం ప్రభావం పడే ఛాన్స్ ఉందనే టెన్షన్ మెగా అభిమానుల్లో కనిపిస్తోంది.

ఒక పెద్ద లెవెల్ సినిమా సక్సెస్ కావాలంటే మంచి మ్యూజిక్ చాలా కీలకం. ఇప్పుడే థగ్ లైఫ్ ఫలితం చూసిన మెగా ఫ్యాన్స్, రెహమాన్ నుంచి చరణ్ మూవీకి ఎలాంటి మ్యూజిక్ వస్తుందా అని ఆశగా, ఒకింత ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. మరి రెహమాన్ ఈసారి అదరగొట్టే మ్యూజిక్‌తో మెగా ఫ్యాన్స్ అంచనాలను చేరతాడా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories