కమల్‌ చేతులు మీదుగా..!

స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌  కమల్‌ హాసన్‌ కుమార్తెగా , నటన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సౌత్‌ ఇండస్ట్రీలో పలు భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.  ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి. సింగింగ్, యాక్టింగ్, మ్యూజిక్ ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నశ్రుతి గురించి అందరికీ తెలిసిందే. ఆమె నటనతో పాటు అప్పుడప్పుడూ పాటలు కూడా పాడుతూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా శ్రుతి హాసన్ ఓ సినిమా కోసం మరోసారి తన గొంతుని సవరించింది. ‘ఇలెవెన్’ అనే సినిమాలో శ్రుతి హాసన్ ఓ అద్భుతమైన పాటను పాడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇటీవలే విడుదల చేసింది ఆ చిత్రబృందం. అయితే, దసరా పండుగ కానుకగా ఈ పాటను అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది.

‘ది డెవిల్ వెయిటింగ్’ అనే ఈ పాటను విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారంట. అక్టోబర్ 11న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ పాటను ఆయన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ‘ఇలెవెన్’ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories