మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులో ఈ సెప్టెంబర్ 22న చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ పై మరో సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముగ్గురు టాప్ దర్శకులు రంగంలోకి దిగబోతున్నారంట.
ఇంతకీ వారెవరో కాదు తారక్ తో వర్క్ చేసిన వర్క్ చేయనున్న సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లు అని సమాచారం. మరి ఈ అందరి కలయిలో అంటే ఈవెంట్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.