థామాలో ఆ ముగ్గురు స్టార్‌ నటులు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘థామా’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు స్టార్ కాంబినేషన్ కారణంగా కూడా సినిమా చుట్టూ బజ్ పెరిగిపోయింది.

ఈ సినిమా కూడా మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన పూర్వ చిత్రాలతో ఏదో విధంగా లింక్ అయ్యిందనే చర్చ బీటౌన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ‘స్త్రీ 2’ చిత్రానికి ఈ సినిమా దగ్గర పోలికలు ఉన్నాయన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. భయానకతతో పాటు కామెడీ కలిపిన కథాంశంతో ‘థామా’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని స్టార్ సెలబ్రిటీలు కేమియో రోల్స్‌లో కనిపించబోతున్నారని హీరో ఆయుష్మాన్ ఖురానానే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముగ్గురు ప్రముఖులు ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తారని ఆయన చెప్పినా, వారి పేర్లు మాత్రం గోప్యంగా ఉంచారు. అయితే అందులో ఒకరు ‘స్త్రీ 2’ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అని బీటౌన్ టాక్. మిగతా ఇద్దరి పేర్లు ఎవరో తెలుసుకోవాలంటే థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories