జగన్ భక్తుల్లో ఆ బుద్ధులు మారలేదు!

ఎన్నికలు అంటూ వస్తే చాలు.. అవి ఏ స్థాయి ఎన్నికలు అయినా సరే.. ఓటర్లను ప్రలోభ పెట్టడం, మభ్యపెట్టడం, మద్యం తాగించడం లోబరచుకోవడం ఎన్నికల్లో నెగ్గడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన దీర్ఘకాలిక విధానం. కొన్ని సందర్భాల్లో వారి పాచికలు పారాయి- నెగ్గారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వేల కోట్ల రూపాయలు పంచినప్పటికీ.. అంతే విలువైన మద్యం యేరుల్లా పారించినప్పటికీ పార్టీ మాత్రం గెలవలేదు. అయితే.. ఇప్పటికీ జగన్ భక్తుల్లో ఆ బుద్ధులు మాత్రం మారలేదని కనిపిస్తోంది. అంత సీరియస్ గా ఎన్నికలుగా ఎవ్వరూ పరిగణించిని.. ఏపీ సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్ భక్తుడైన ఉద్యోగసంఘాల నేత వెంకట్రామిరెడ్డి అనుచిత మార్గాలను అవలంబించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అర్ధరాత్రి పార్టీలు జరుగుతుండగా.. ఫిర్యాదు అందుకున్న ఎక్సయిజ్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం కూడా జరిగింది.

ఏపీ సచివాలయ క్యాంటీన్ డైరెక్టర్ల పోస్టులకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. సాధారణంగా అయితే ఇవి అంత సీరియస్ గా తీసుకునే ఎన్నికలు కాదు. కానీ.. జగన్ భక్తుడైన ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి వీటిని కూడా సీరియస్ గా తీసుకున్నారు. తమ ప్యానెల్ మనుషుల్ని గెలిపించుకోవడానికి భారీస్థాయిలో సచివాలయ ఉద్యోగులకు మందు, విందు, చిందు లతో కూడిన భారీ పార్టీ ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇలాంటి అనుచిత ప్రలోభాలు జరుగుతున్నట్టుగా సమాచారం లీక్ అయింది. రాత్రి 11 గంటల సమయంలో అనుమతి లేకుండా ఈ స్థాయిలో మందు పార్టీలు విందులు నిర్వహిస్తున్నందుకు ఎక్సయిజు పోలీసులు దాడిచేసి ఆపు చేయించారు. ఈ మందు పార్టీ తానే ఏర్పాటు చేసినట్టుగా వెంకట్రామిరెడ్డి స్వయంగా ఒప్పుకోవడంతో ఆయనను అరెస్టు కూడా చేశారు.

అంత సీరియస్ గా పట్టించుకోని సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు కూడా ఈ స్థాయి అతి చేయడం వెనుక మర్మం ఏమిటి? అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎన్నిక ఎంత చిన్నది అయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల ప్యానెల్ గెలిచినట్లయితే.. ప్రభుత్వం పట్ల అసంతృప్తి వస్తున్నట్టుగా ప్రచారం చేయడం సాధ్యమవుతుందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా తాను ప్రభుత్వోద్యోగి అని మరచిపోయి.. వైసీపీ కార్యకర్త లాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు క్యాంటీన్ ఎన్నికల్లో గెలిస్తే.. అమరావతి సచివాలయ ఉద్యోగుల్లోనే ఎన్డీయే కూటమి పాలన పట్ల సంతృప్తి లేదని బురద చల్లడం సాధ్యమవుతుందని ఇలా మందు పార్టీలతో ప్రలోభాలకు దిగినట్టుగా తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories