ఈసారి కూడా బామ్మార్ది మంచి జోరు మీద ఉన్నాడుగా!

మ్యాడ్‌ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నితిన్‌ నార్నే మంచి హిట్‌ ను సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్దిగా శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఏమైందో ఏంటో ప్రేక్షకుల ముందుకు రాలేదు. మ్యాడ్‌ సినిమాతో  థియేటర్లలలో ప్రత్యక్షం అయ్యాడు.

ఈ సినిమా నితిన్‌ కు మంచి పేరు వచ్చింది. దీంతో మంచి కథలను ఎంచుకోవడం వైపు అడుగులు వేస్తున్నాడు నితిన్‌. ప్రస్తుతం నితిన్‌ ఆయ్‌… మేము ఫ్రెండ్స్ అనేది ఉప శీర్షిక. అంజి కంచిపల్లి డైరెక్షన్ లో యంగ్‌ ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌ గా నయన్‌ సారిక అనే ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మీ ఈ  చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ముహుర్తం పెట్టారు. సూఫీయానా..గుండెల్లోనా అంటూ సాగే ఈ సాంగ్‌ ప్రోమోను ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

రామ్‌ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రోమోలో నది మధ్యలో పడవలో నితిన్‌ .. హీరోయిన్‌ గురించి వివరస్తున్నట్లు కనిపిస్తుంది. మార్చి 20 న సాంగ్‌ ను రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సారి కూడా మరోసారి ఎన్టీఆర్ బామ్మర్ది హిట్‌ అందుకునేలా ఉన్నాడంటున్నారు నెటిజన్లు.

Related Posts

Comments

spot_img

Recent Stories