పాన్ వరల్డ్ మార్కెట్‌లో ఎక్కువగా ఆదరణ పొందే జానర్లలో సూపర్ హీరో సినిమాలు ఒక ప్రధానమైనవి. కానీ మన భారతీయ సినిమా దగ్గర ఈ తరహా చిత్రాలు చాలా అరుదుగానే కనిపిస్తాయి. తెలుగు సినిమా విషయానికి వస్తే, ఈ జానర్ కి ఇప్పుడు మాత్రమే అసలైన ఆరంభం అవుతోంది. తాజాగా వచ్చిన హను మాన్ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత, అదే హీరో తేజ సజ్జ మరోసారి సూపర్ హీరో లుక్ లో కనిపించబోతున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా పేరు మిరాయ్.
ఇదే సమయంలో మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో థ్రిల్లర్ కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఈ తరహా కొత్త జానర్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన తాజా సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో భారీ స్థాయిలో ప్రకటించారు.