ఈ పాపం జగన్ ను ఊరికే వదలదు!

కేవలం రాజకీయ లబ్ధి ఒక్కటే ఆయన లక్ష్యం. ప్రజలు, పేదలు, వృద్ధులు ఎన్నిరకాలుగా అగచాట్లు పడినా ఆయనకు పట్టదు! వారు ఎక్కువ కష్టాలు పడుతున్న కొద్దీ.. వారి ప్రాణాలు పోయే కొద్దీ ఆయనకు ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎన్ని ఎక్కవ ప్రాణాలు పోతే అంత ఎక్కువ ఆనందం. అంతగా చంద్రబాబు మీద బురద చల్లవచ్చు.. చంద్రబాబు కుట్ర చేశాడని టముకు వేయవచ్చు. ఆయన ఎన్ని రకాల వంకర ప్రచారాలైనా చేయవచ్చు గాక.. కానీ సత్యం దాగుతుందా? ఈ పాపాలు ఊరికే పోతాయా? నానా కష్టాలు పడుతున్న, చచ్చిపోతున్న వారి ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగలకుండా ఉంటుందా? అని ప్రజలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

మే నెలవచ్చింది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడానికి సంబంధించి.. మళ్లీ డ్రామాను ప్రారంభించింది జగన్ సర్కారు. ఫుష్కలంగా అందుబాటులో ఉన్న సచివాలయాల సిబ్బంది, ఇతర రెవెన్యూ సిబ్బందితో లబ్ధిదారులు అందరికీ ఎప్పటిలాగా ఇళ్లవద్దకే పింఛన్లు అందే ఏర్పాటు చేయాలని.. చంద్రబాబునాయుడు తొలినుంచి మొత్తుకుంటూనే ఉన్నారు.  మార్చి నెలాఖరులో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కకు తప్పించాలంటూ ఈసీ ఆదేశాలు వెలువడినప్పటినుంచి చంద్రబాబు ఒకటే మాట చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. వృద్ధులందరూ సచివాలయాల వద్దకు వచ్చి తీసుకోవాలని దుర్మార్గమైన ఆదేశాలు జారీచేసింది. వారందరూ పొద్దున్నించి వచ్చి పడిగాపులు పడుతుండగా.. డబ్బులు సచివాలయాల ఖాతాల్లోకి సకాలంలో ట్రాన్స్ఫర్ చేయకుండా ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ప్రభుత్వ పాపానికి 32 మంది బలైపోయారు. ఇప్పుడు మే వచ్చింది. ఎండలు మరింత పెరిగాయి. గత పదిరోజులకు పైగా చంద్రబాబునాయుడు పదేపదే మొత్తుకుంటున్నారు. ఇళ్ల వద్ద మాత్రమే పింఛన్లు ఇవ్వండి. వృద్ధుల్ని ఎండల్లోకి రానివ్వవద్దు.. వారి ప్రాణాలు తీయవద్దు అని ఆయన కోరుతూనే ఉన్నారు.

అయినా జగన్ వృద్ధుల బాగు గురించి వారి మేలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంత మంది చస్తే చంద్రబాబు మీద అంతగా బురద చల్లవచ్చు అనుకున్నట్టుగా.. సచివాలయాలకు రమ్మనకుండా, అందరి డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో వేసేశారు. ఇప్పుడు ప్రజలు బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయాల్సి వస్తోంది. బ్యాంకు సర్వర్లు పనిచేయక మళ్లీ మళ్లీ ఎండలో వెళ్లాల్సి వస్తోంది. ఇంత దుర్మార్గం ప్రజలను వేధించే ప్రభుత్వంగా జగన్ సర్కారు తయారైందని ప్రజలు ఈసడించుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories