ఆ సినిమా కోసమేనా ఈ లుక్‌!

ఇళయ దళపతి విజయ్  హీరోగా,  స్నేహ , మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) గురువారం గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ టాక్ ని అందుకోలేదు.

 కానీ మిక్స్డ్ టాక్ ని అయితే తెచ్చుకుంది. ఇక ఈ  సినిమా కోసం విజయ్ చాలా రకాల లుక్స్ ని ప్రిపేర్ చేసిన సంగతి తెలిసిందే. అవి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ని పంచాయి. ఇక ఈ సినిమా ఇలా విడుదలై ప్రేక్షకుల ముందుకు రాగానే విజయ్ నుంచి నయా లుక్ ఒకటి షాకింగ్ గా మారింది.

మీసాలు తీసేసి కేవలం గడ్డంతోనే కనిపిస్తూన్నాడు. దీనితో ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ తన నెక్స్ట్ సినిమా కోసమేనా అన్నట్టుగా ఇపుడు ఓ టాక్ నడుస్తుంది.  తన నెక్స్ట్ సినిమా దర్శకుడు హెచ్ వినోద్ తో ఉంటుంది అని టాక్‌ నడుస్తుంది. మరి ఈ లుక్ ఆ సినిమా కోసమేనా అని తెలుస్తుంది. మరి చూడాలి విజయ్ ఏ సినిమా కోసం ఇలా మారాడు అనేది.

Related Posts

Comments

spot_img

Recent Stories