ఇదేం ఉందిలే!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న పలు మోస్ట్‌ అవైటెడ్ భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజీ” అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ సినిమా “గేమ్ ఛేంజర్” లు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకి కూడా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ నే సంగీతం అందిస్తుండగా తన నుంచి వచ్చిన బీట్స్ అయితే ఫ్యాన్స్ ని ఎంతగానో ఆలరిస్తున్నాయి

ఓజి నుంచి మొన్న పవన్ బర్త్ డే కే ఓ పాట అభిమానుల ముందుకి రావాల్సి  ఉంది కానీ రాలేదు. మరి గేమ్ ఛేంజర్ నుంచి అయితే ప్రామిసింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో కూడా సూపర్‌ గా ఉంది. మరి ఈ సినిమాల తాలుకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై థమన్ సాలిడ్ ప్రామిస్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ మాస్ స్కోర్ పై రిప్లై ఇస్తూ ఇదేం ఉంది ఓజి, గేమ్ ఛేంజర్ లు ఇవ్వబోయే హై వేరే లెవెల్లో ఉంటుంది.

వెయిట్ చెయ్యండి అంటూ థమన్‌ తెగ ఊరిస్తున్నాడు. అలాగే ఈ డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ తో రచ్చ లేపేద్దాం అని థమన్ అంటున్నాడు. దీనితో ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories