కూలీలో నాగ్‌ రోల్‌ ఇదే!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఈ సినిమా మరో నిదర్శనంగా నిలవబోతోందని టాక్ ఉంది.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో నాగార్జున వేసే పాత్ర గురించి ఆయన స్వయంగా వివరించారు. తాజాగా ఆయన ‘కుబేర’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో ‘కూలీ’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. లోకేశ్ కనగరాజ్ మొదటగా ఈ కథను వినిపించడానికి ముందే, ఈ సినిమాలో విలన్ పాత్ర చేయగలరా అని అడిగారట. కథలోని ఆ పాత్ర వినగానే తాను వెంటనే అంగీకరించానని నాగార్జున చెప్పాడు.

నాగ్ చేస్తున్న ఈ నెగటివ్ రోల్ అభిమానులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉండబోతుందంటూ యూనిట్ చెబుతోంది. ఇందులో శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రజినీకాంత్ స్టైల్, లోకేశ్ కనగరాజ్ టేకింగ్, నాగార్జున విలన్ షేడ్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు తెరలేపాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories