“వార్ 2” విడుదల తేదీ ఇదే! ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఏ రేంజ్ మల్టీస్టారర్ చిత్రాలు పలు భాషలు నుంచి వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా భారీ హైప్ ని అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు సెట్ చేసుకున్న క్రేజీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “వార్ 2” అనే చెప్పాలి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ కి సీక్వెల్ గా వస్తున్నా ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా సాలిడ్ రోల్ చేస్తున్నాడు.
దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ ట్రాకర్ తరన్ ఆదర్శ్ మేకర్స్ ఈ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తన నుంచి వచ్చింది కాబట్టి ఇదే అఫీషియల్ అని అందరికీ తెలుసు. కానీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి మాత్రమ్ ఇంకా ఎలాంటి అప్డేట్ కానీ కన్ఫర్మేషన్ కానీ దీనిపై రాలేదు. ఇక అక్కడ నుంచి గ్యాప్ లో వార్ 2 వాయిదా అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇపుడు ఫైనల్ గా వార్ 2 రిలీజ్ డేట్ పై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14నే విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. సో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై అండ్ మల్టీ స్టారర్ చిత్రం ఆరోజున రానుంది అని చెప్పవచ్చు.