ఇది అసలు విషయం!

టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొన్నేళ్లలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన యంగ్ గ్లామరస్ హీరోయిన్స్ లో స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకామె అని చెప్పాలి. రకుల్ ప్రీత్ టాలీవుడ్ సినిమాలు చేసినన్నినాళ్లు మంచి హిట్స్ అందించి ఇపుడు ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే లేటెస్ట్ గా తన పెళ్లి విషయంలో ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

రకుల్ గత ఏడాదిలోనే ప్రముఖ బిజినెస్ మెన్ జాకీ భగ్నానిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కుటుంబీకులు స్నేహితులు నడుమ తన పెళ్లి సింపుల్ గా చేసేసుకుంది. అయితే ఈ పెళ్ళిలో వారు ఎవరి నుంచి కూడ ఫోన్స్ ని అనుమతించకపోవడం కొంచెం ఆసక్తిగా మారింది. మరి దీనిపై అసలు విషయం రీసెంట్ గా రివీల్ చేసింది.

అయితే తాను పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఫోన్స్ లాంటివి వద్దనుకున్నామని, మా పెళ్లి ఫోటోలు ఎక్కడ లీక్ అవుతాయో లేక వేరే ఉద్దేశం దీని వెనుక లేదు. ఎక్కువ ఆర్భాటాలకు వెళ్లకుండా కుటుంబంతో అలా పెళ్లి చేసుకోవడం మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది అని తాను చెప్పుకొచ్చింది. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories