ఇదేం లాజిక్ : ప్రజలు వెర్రివాళ్లు అనుకున్నావా జగన్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రాను రాను తన మాటల్లో కనీస లాజిక్ ఉండాలనే సంగతి మర్చిపోతున్నట్టున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. చాలా విషయాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని అందరూ సమానంగా, అడ్డగోలుగా నిందిస్తున్నప్పటికీ.. ఆయన మాటల కంటె ఆయన అనుచరులు కిందిస్థాయి నాయకుల మాటల్లోనే కాస్త లాజిక్ ఉన్నట్టుగా తేలుతోంది తప్ప.. జగన్ మరీ అర్థరహితంగా మాట్లాడుతున్నారని అంతా అనుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు అయిన నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలు పాలు కావడం ఆయనకు మింగుడుపడని వ్యవహారమే కావొచ్చు. ఆవేదన చెందుతుండవచ్చు. కానీ.. అధికార ఎన్డీయే సర్కారు తమను రాజకీయంగా వేధిస్తోందని నిందించడం వరకు బాగానే ఉంటుంది. అలా కాకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలకు ఎంపీ అయిన అవినాష్ రెడ్డికి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించడం చాలా కామెడీగా ధ్వనిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి నిజంగానే లాజిక్ తెలియక అమాయకంగా మాట్లాడుతున్నారా? లేదా, తాను ఏం మాట్లాడినా సరే.. దాన్ని అందుకుని పదేపదే మాట్లాడి ప్రచారం చేయడానికి కొందరు అనుచరులు, ఆ మాటలు నమ్మి మాయలో పడడానికి కొందరు ప్రజలు ఉంటారనే నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నారా? అనేది అర్థం కావడం లేదు.
పార్లమెంటులో పనిచేసే ఎంపీ అయినంత మాత్రాన ఏపీలో జరిగే ఏ వ్యవహారానికీ మిథున్ రెడ్డికి సంబంధం ఉండే అవకాశమే లేదు అని జగన్ చెప్పదలచుకుంటున్నట్టుగా ఉంది. ఆయన ఢిల్లీలో పనిచేసే ఎంపీనే కావొచ్చు గాక.. కానీ గెలిచినది రాష్ట్రంలోని రాజంపేట నుంచే కదా? అనేది ఒక ప్రశ్న. అలాగే.. అవినీతి అరాచకాల విషయంలో ప్రజాప్రతినిధులకు టెరిటరీలు, సరిహద్దులు ఉంటాయా? అనేది ఇంకో ప్రశ్న. అంటే ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలో మాత్రమే దోచుకోవాలి… ఎంపీలు ఫలానా చోట మాత్రమే దోచుకోవాలి? అని ఏమైనా రాజ్యాంగం సరిహద్దు విభజన చేసినట్టుగా జగన్ చదువుకున్నారా? అనేది మరో ప్రశ్న.

వర్తమాన రాజకీయాల్లో రాజకీయ నాయకులు దోచుకోవడానికి జిల్లాల రాష్ట్రాల ఎల్లలు అడ్డుకాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ఎక్కడో ఢిల్లీలో ఉండే లిక్కర్ స్కామ్ లో దోచుకున్న వైనం మనం అందరం గమనించాం. ఆ కేసులో ఈడీ అరెస్లు చేయగా ఆమె సుదీర్ఘకాలం జైలులో గడిపి బెయిలుపై వచ్చారు. మిథున్ రెడ్డి ఎంపీ అయినంత మాత్రాన.. ఆయనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ముడిపెడితే తప్పు గానీ.. మూడున్నర వేల కోట్ల రూపాయల దోపిడీ పర్వానికి మాస్టర్ మైండ్ గా వ్యవహరించి స్వయంగా సూత్రధారిగా ఉంటూ నడిపిస్తే.. ఎంపీ గనుక.. రాష్ట్రంలోని వ్యవహారాలతో ఆయనకేం సంబంధం అనడం చాలా కామెడీగా ఉంది. ఇదేక్రమంలో మిథున్ రెడ్డి ని సమర్థించే క్రమంలో.. ‘అసలు జరగని స్కామ్’ అనే బూటకపు వాదనను కూడా జగన్ మర్చిపోయినట్టు కనిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories